యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం ; రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని యువర్స్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు షీలా నాగేంద్ర, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గల 300 మంది రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా షీలా నాగేంద్ర మాట్లాడుతూ యువర్స్ ఫౌండేషన్ తరపున 2008 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. దాతల సహాయ సహకారాలతోనే ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. నేటి అన్నదాన కార్యక్రమానికి దాతలుగా మామిళ్ళ ప్రసాద్, జయచంద్ర రెడ్డి, గూండా నాగరాజులు వ్యవహరించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహాయ సహకారము లేనిదే ఏ కార్యక్రమమూ కూడా విజయవంతం కాదు అని తెలిపారు. యువర్ ఫౌండేషన్ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా పట్టణ గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు వై కే శ్రీనివాసులు, కోటేశ్వరరావు, సభ్యులు సత్రశాల మల్లికార్జున, గీతా లోకేష్, గుండా పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది..
RELATED ARTICLES