Monday, January 13, 2025
Homeజిల్లాలుఅనంతపురంపేద ప్రజలకు ఇచ్చిన స్థలాలపై సమగ్ర విచారణ చేయాలి..

పేద ప్రజలకు ఇచ్చిన స్థలాలపై సమగ్ర విచారణ చేయాలి..

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్
విశాలాంధ్ర గుంతకల్ : గుంతకల్ పట్టణం లోని ధోనిముక్కల రోడ్డులో పేద ప్రజలకు ఇచ్చిన స్థలాలపై సమగ్ర విచారణ చేయాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన విధంగా రెండు సెంట్ల స్థలం 4 లక్షలు నిర్మాణానికి పేదలకు ఎప్పుడు ఇస్తారంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్ ప్రశ్నించారు. దోనుముక్కల రోడ్డులో పేదలకు ఇచ్చిన లేఅవుట్ల ను సిపిఐ ప్రతినిధి బృందం తో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ…. గుంతకల్ పట్టణంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు పేరుతో వేల పట్టాలు ఇచ్చారన్నారు. 2014-2019 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో రైల్వే లైను కు ఇరువైపులా ఉన్న పేదలకు, మరియు మున్సిపల్ స్థలాల్లో ఉన్న పేదలను ఖాళీ చేయించాలని పట్టాలు వేల లోనే ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ పట్టాలు ఇవ్వడానికి భూములు కొనుగోలు చేయడానికి వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చినది అని దాని ప్రకారంగా పదివేల పట్టాలపైనే పేదలకు పట్టాలు ఇచ్చినట్లు ప్రభుత్వం రికార్డులలో ఉన్నాయి కానీ ఈ పట్టాలు నిజమైన పేదలకు అందలేదన్నారు . అధికారంలో ఉన్న వారి అనుచరులకు ఈ స్థలాలు అన్ని చేరినాయన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన స్థలాల యందు సకాలంలో ఇల్లు నిర్మాణానికి నిధులు ప్రభుత్వం విడుదల చేయక, ఇచ్చిన స్థలం (1 ఒక సెంటు) తక్కువ కాబట్టే ఇల్లును నిర్మించక లేకపోయారన్నారు.
జగన్ ప్రభుత్వంలో నే 3464 మందికి పట్టాలిస్తే, కేవలం 1.196 మంది మాత్రమే పూర్తిగా ఇల్లు నిర్మించుకున్నారని, మిగిలిన వారు ఇల్లు నిర్మిచూపుకోలేదని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు అన్నారు. కానీ ఇంటి నిర్మాణాల కు మాత్రం 39 కోట్ల 90 లక్షల 40 వేల 906 రూపాయలు పేదలకు ఇచ్చినట్లు హౌసింగ్ రికార్డులో తేలుతున్నాయన్నారు.
మరి ఇదే నిజమైతే 3464 మంది ఇల్లు ఎందుకు నిర్మించుకోలేదు అని పేర్కొన్నారు. ఇలాంటి అవకతలు, అవినీతి వీటిలో చోటు చేసుకుంది, తక్షణమే రెవెన్యూ మున్సిపల్ అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలిన చేసి ప్రభుత్వ రికార్డులలో ఉన్న పేదల చేతిలో ఇళ్ల స్థలాలు ఉన్నాయా? లేక గతంలో అధికారంలో ఉన్న వారి అనుచరుల చేతిలో ఉన్నాయా? విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కార్యదర్శి వీరభద్ర స్వామి, పట్టణ కార్యదర్శి గోపీనాథ్, కార్యదర్శి గౌస్, మండల కార్యదర్శి రాము రాయల్, ఏఐటియుసి మండల అధ్యక్షులు తలారి సురేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్, ప్రజానాట్యమండలి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు