Thursday, February 27, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిస్కానింగ్ సెంటర్ లపై తగు జాగ్రత్తలు, ఆకస్మిక తనిఖీలు ఉండాలి.. ఆర్డీవో మహేష్

స్కానింగ్ సెంటర్ లపై తగు జాగ్రత్తలు, ఆకస్మిక తనిఖీలు ఉండాలి.. ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని స్కానింగ్ సెంటర్ లపై తగు జాగ్రత్తలతో పాటు ఆకస్మిక తనిఖీలు చేస్తూ రోగులకు మరిన్ని సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆర్డిఓ కార్యాలయంలో పిసిపిఎన్ డిటి చట్టం అమలుపై డివిజనల్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్డిఓ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని స్కానింగ్ సెంటర్లు రిజిస్టర్ కావడం జరిగిందని వాటిపై ఎక్కడ ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ప్రతి స్కాన్ సెంటర్ ను రెగ్యులర్గా అన్ని ప్రభుత్వ విభాగముల వారు తనిఖీలు తప్పనిసరిగా చేయాలని వారు తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరపరాదని, అందర్నీ కూడా తన ఆకస్మిక తనిఖీలో హెచ్చరించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా డేకాయ్ ఆపరేషన్ కూడా విధిగా జరపాలని తెలిపారు. చట్టముపై మహిళా సమైక్య సమావేశములలో ఉన్నత పాఠశాలలలో, జూనియర్, డిగ్రీ కళాశాలలో తప్పనిసరిగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. తదుపరి డిప్యూటీ డిఎంహెచ్వో సెల్వియా సాల్మన్ మాట్లాడుతూ ఆకస్మిక తనిఖీలు తప్పనిసరి అని, ప్రభుత్వ ఆదేశాలను తప్పక అమలు చేయాలని వారు తెలిపారు. తక్కువ వయసులోనే గర్భం దాల్చడం పై ఆందోళన కూడా తాము వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. ఐసిడిఎస్, పోలీస్, వాలంటరీ సంస్థలతో కలిగి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో బాబా ఫక్రుద్దీన్, డాక్టర్లు వెంకటేశ్వర్లు, డాక్టర్ వైష్ణవి, డాక్టర్ సురేష్ నాయక్, రోటరీ క్లబ్ ప్రతినిధి నరేందర్ రెడ్డి, అన్నమయ్య సేవా మండలి సభ్యులు పోతిరెడ్డి, అయ్యప్ప సేవా సమితి సభ్యులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు