విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్, జాతీయ యువజన అవార్డ్ గ్రహీత పెంకి చైతన్య కుమార్, రాజాం నాయీ బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఈరోజు కరపత్రాన్ని విడుదల చేశారు. రాజాం నాయీ బ్రాహ్మణ సేవా సంఘం డోలు సన్నాయి, బ్యాండ్ పార్టీ కళాకారుల ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా రాజాం మండలం రాజాం పట్టణంలో ఆదర్శ పురుషుడైన శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవాలను 28.01.2025 మంగళవారం రాజాం టి.టి.డి కల్యాణ మండపంలో ఘనంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6.30నిమిషాల నుండి రాజాం నవదుర్గ మాత ఆలయం నుండి త్యాగరాజ స్వామి చిత్రపటం తో టి.టి.డి కల్యాణ మండపం వరకు ఊరేరిగింపు, శేక్సాపొను కచేరి మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకు, దొంతకుర్తి త్రినాథరావు మాస్టారు, శ్రీమతి నిర్మల దంపతులకు సాయంత్రం 6గంటలకు చిరు సత్కారం, నాధస్వర కచేరి సాయంత్రం 6.30 నుండి 9.30 వరకు, పంచరత్న సేవ ఉదయం 9గంటల నుండి, నాధస్వర కచేరి 10.30గంటల నుండి, శేక్సాపొను కచేరి ఉదయం 12గంటల నుండి నిర్విహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతీ ఒక్కరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమంలో పసుపురెడ్డి వెంకటరమణ నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, కొండేటి దుర్గారావు సెక్రటరీ, కమిటీ సభ్యులు సొనాయిల తవిటయ్య, సుందరపల్లి రాజేష్, ఎం.అప్పలసూరి, తాతపూడి సూర్యనారాయణ, గణేష్ చేతుల మీదుగా కరపత్రాన్ని విడుదల చేసారు.