లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాలాచార్యులు
విశాలాంధ్ర ధర్మవరం;; దేశ సేవకు నేటి యువత అంకితం కావాలని లైన్స్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపారాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం శైలజ, లైన్స్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాలచార్యులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోశే రాధాకృష్ణ, మోహన్ దాస్, రాజగోపాల్, వెంకటేష్ కుమార్, చందా నాగరాజు, నాగేంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
దేశ సేవకు నేటి యువత అంకితం కావాలి..
RELATED ARTICLES