విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గ్రామీణ ప్రజలందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పోతుకుంట గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేశారు. టూవీలర్, ఫోర్ వీలర్ తోపాటు లారీలను తదితర వాహనాలను ఆపి, రికార్డులను పరిశీలించారు. రోడ్డు భద్రత నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన కల్పించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. ద్విచక్ర వాహనంలో, ఫోర్ వీలర్ వాహనంలో ప్రయాణిస్తే హెల్మెట్, బెల్టు ధరించుట తప్పనిసరిగా ఉండాలని, వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులను మా తనిఖీలో భాగంగా తప్పనిసరిగా చూపించాలని తెలిపారు. మైనర్ బాల బాలికలకు వాహనాలు ఇవ్వరాదని, అలా ఇస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. వాహనదారుడు మద్యం తాగి నడపరాదని, దీనివల్ల ప్రమాదాలు జరగడంతో పాటు వాహనదారుడి కుటుంబం కూడా వీధిపాలు అవుతుందని తెలిపారు. కావున వాహనదారులు తమ విధులను ముగించుకొని, నేరుగా కుటుంబంలో చేరుకోవాలని తెలిపారు. అంతేకాకుండా పరిచయం లేని వ్యక్తులను కూడా వాహనంలో ఎక్కించుకోరాదని, దీనివల్ల దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి.. రూరల్ ఎస్సై శ్రీనివాసులు
- Advertisement -
RELATED ARTICLES


