Friday, January 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికిషోర్ వికాసం పై మండల స్థాయి శిక్షకులకు శిక్షణ

కిషోర్ వికాసం పై మండల స్థాయి శిక్షకులకు శిక్షణ

మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, సిడిపిఓ లక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ సిడిపిఓ లక్ష్మీ ఆధ్వర్యంలో కిషోర్ వికాసం పై మండల స్థాయి శిక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణలో భేటీ బచావో- బేటి పడావో అన్న అంశంపై పలు వివరాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బాల్య వివాహాలు, బాల కార్మికులు, బాల నేరస్తులు నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కిషోర్ వికాసం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కిషోర్ బాల బాలికల సర్వతో ముఖాభివృద్ది కొరకు మండల స్థాయిలో కమిటీలను కూడా నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో బాలబాలికల వ్యక్తిగత ఆరోగ్యము, సంరక్షణ, లైంగిక వేధింపులు, బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాలు,చదువు యొక్క ప్రయోజనాలు చర్చించి మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కొనసాగుతూ ఉండడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు అరుణ, లత, మహిళా పోలీసులు, ఏఎన్ఎంలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అంగన్వాడీ టీచర్లు, సచివాలయ సిబ్బంది, ఐ సి పి ఎస్ సిబ్బంది మురళి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు