Monday, January 13, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం రైల్వే స్టేషన్ లో బాబా భక్తులకు అన్నదానం..

ధర్మవరం రైల్వే స్టేషన్ లో బాబా భక్తులకు అన్నదానం..

శ్రీ సత్య సాయి సేవ సమితి.. సుభదాసు భజన మందిరం నిర్వాహకులు.
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని రైల్వే స్టేషన్లో ప్రశాంతి నిలయం నుండి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కు పాడేరు కు పోవుచున్న 90 మంది పుట్టపర్తి బాబా భక్తాదులకు ధర్మవరంలోని శ్రీ సత్య సాయి సేవ సమితి శుభదాసు భజన మందిరం సేవాదళ్ సభ్యులు భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సేవాదళ్ సభ్యులు స్వయంగా 90 మందికి వడ్డెన చేసి పంపించారు. తదుపరి బాబా భక్తాదులు సుబ్బదాసు భజన మందిరం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రైల్వే స్టేషన్ స్టేషన్ మాస్టర్ మాట్లాడుతూ ధర్మారం రైల్వే స్టేషన్లో శ్రీ సత్య సాయి సేవ సమితి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి సేవా కార్యక్రమాలతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషించేదగ్గ శుభదాయకమని తెలిపారు. రైల్వే స్టేషన్లోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తరఫున సేవా సమితికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం శుభదాసు భజన మందిరం సేవాదళ్ సభ్యులు మాట్లాడుతూ దాతల సహాయ సహకారంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం మా యొక్క కర్తవ్యమని, పుట్టపర్తి బాబా సందేశించిన మేరకే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పదిమంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు