Homeజాతీయందిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసలు

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసలు

- Advertisement -


దిల్లీ: ఇటీవల దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరణ్‌జీత్ సింగ్ సంధూపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. ఆయన ఈ మేరకు ట్రూత్ సామాజిక వేదికగా సోస్టు చేశారు. ‘దిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన తరణ్‌జీత్ సంఇంగ్ సంధూకి అభినందనలు. అమెరికా మాజీ రాయబారిగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేందుకు తరణ్‌జీత్ ఎంతో నిబద్ధత చూపించారు’. అని తన పోస్టులో రాసుకొచ్చారు. ఇది వరకు ఆయనతో దిగిన ఫొటోను పంచుకున్నారు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరణ్‌జీత్ 11న బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు