హమాస్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ సంస్థ చెరలో ఉన్న మిగిలిన బందీలను వెంటనే విడుదల చేయకపోతే గాజాను నాశనం చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో ఆయన స్పందిస్తూ… బందీలను హమాస్ వెంటనే విడుదల చేయాలని అన్నారు. అలాగే చనిపోయిన వారి మృతదేహాలను అప్పగించాలని పేర్కొన్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు. దీనికోసం ఇజ్రాయెల్ కు ఏం కావాలో ప్రతిదాన్ని పంపుతానని స్పష్టం చేశారు. హమాస్ కు చెందిన ఏ ఒక్కరు కూడా సురక్షితంగా ఉండరని హెచ్చరించారు. మీకు ఇదే చివరి హెచ్చరిక అని చెప్పారు. గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు ఎదురుచూస్తోందని… మీరు గాజాను వదిలిపెట్టాలని హమాస్ కు వార్నింగ్ ఇచ్చారు.
హమాస్ కు ట్రంప్ వార్నింగ్
RELATED ARTICLES