ఈ కమిటీ లో ఏపీ అధికారికి అవకాశం దక్కడం ఇదే మొదటిసారి
- శ్రీకాకుళం జిల్లా వాసికి అరుదైన అవకాశం తో జిల్లా వాసుల హర్షం
విశాలాంధ్ర – శ్రీకాకుళం: కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం హరిదాసు పురం గ్రామానికి చెందిన కణితి నవీన్ చైర్మన్ గా నియమితులు అయ్యారు. ఏపీ అర్ అండ్ బీ శాఖ లోని జాయింట్ స్టేట్ ఆర్కిటెక్ట్ గా ఉన్న నవీన్ గతం లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఛైర్మెన్ గా నియమించింది. ఈ కమిటీ లో ముగ్గురు సభ్యులు ఉంటే అందులో ఒకరిని ఎన్నుకుంటారు. మిగిలిన ఇద్దరిని కేంద్రం నామినేట్ చేస్తుంది. పుష్కర్ మురళీధర్ కన్విండే ( మహారాష్ట్ర) అజయ్ కేశవ్ ( చండీఘర్) అనే సభ్యులను కేంద్రం నామినేట్ చేసింది. ఈ కమిటీ దేశ వ్యాప్తంగా మౌలిక వసతుల విషయం లో నిబంధనలు పాటించని , తప్పులు చేసిన అర్కిటెక్ట్స్ ల పై ఈ క్రమశిక్షణ కమిటీ విచారించి అర్కిటెక్ట్స్ యాక్ట్ 1972 ప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఈ కమిటీ లో మొదటి సారి రాష్ట్ర అధికారికి అవకాశం కలిగింది. అది కూడా శ్రీకాకుళం జిల్లా వ్యక్తి కి ఈ అవకాశం రావడం తో జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తూ, పలువురు జిల్లా ప్రముఖులు నవీన్ కు శుభాకాంక్షలు తెలిపి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, దేశ వ్యాప్త కమిటీ లో ఛైర్మెన్ గా జిల్లా కు ఎంతో పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.