-మొక్కు చెల్లించుకున్న గణపవరం సాయి బాబా ఆలయ కమిటీ సభ్యులు
విశాలాంధ్ర – గణపవరం (ఏలూరు జిల్లా) : మండల కేంద్రమైన గణపవరం గ్రామంలో వెంచేసియున్నా ప్రముఖ షిరిడి సాయి బాబా ఆలయంలో బుధవారం నిర్వహిస్తున్న ప్రత్యేక పూజ కార్యక్రమాంలో ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. అనంతరం ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉంగుటూరు ఎమ్మెల్యేగా పత్సమట్ల ధర్మరాజు ఎమ్మెల్యే గా గెలిచిన నేపథ్యంలో సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ వేగేశ్న సుబ్బరాజు, ఆలయ కమిటీ సభ్యులు కఠారి రంగరాజు, రుద్రరాజు ఉలవరాజు,వేగెశ్న శ్రీనివాస రాజు తమ అభిమాన ఎమ్మెల్యేకి పటికి బెల్లం తో తులాభారం వేసి మొక్కు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో గణపవరం మండల, గ్రామా కూటమి పార్టీల అధ్యక్షులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, వీర మహిళలు, తెలుగు మహిళలు,తదితరులు పాల్గొన్నారు.