Homeజిల్లాలుఅనంతపురంఅకాల వర్షం...అపార నష్టం

అకాల వర్షం…అపార నష్టం

- Advertisement -

అకాల వర్షాలకు నేలకొరిగిన పండ్ల తోటలు

విశాలాంధ్ర: శింగనమల.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం వ్యాప్తంగా ఆరు మండలాల్లో నిన్న కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శింగనమల, గార్లదిన్నె, నార్పల, బుక్కరాయ సముద్రం, పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో గాలి–వాన ప్రభావంతో పండ్ల తోటలు పూర్తిగా నేలకొరిగాయి.ప్రధానంగా అరటి, చీని , దానిమ్మ, మామిడి, బొప్పాయి, కాకర తోటలు గాలివాన బీభత్సానికి నాశనమయ్యాయి. పంటలు చేతికి వచ్చే సమయంలో ఈ విపత్తు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.రైతులు వేలల్లో ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేసి పంటలను సాగు చేసినప్పటికీ, ఈ దశలో ప్రకృతి విపత్తు కారణంగా వారి ఆశలు నీరుగారిపోయాయి. ఈ పరిస్థితిలో రైతులు, కౌలు రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయారు.“ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు నష్టపరిహారం అందించకపోతే బ్రతుకుదెరువు కష్టమవుతుంది, మరణమే శరణ్యం” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గాలి–వాన బీభత్సంతో పూర్తిగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకుని, నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు