Friday, February 21, 2025
Homeఅంతర్జాతీయంఅక్రమ వలసదారులకు సంకెళ్లు వేస్తున్న వీడియోతో అమెరికా యాడ్..

అక్రమ వలసదారులకు సంకెళ్లు వేస్తున్న వీడియోతో అమెరికా యాడ్..

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని వెతికి పట్టుకుని అధికారులు తిప్పిపంపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్రమ వలసదారుల చేతులు, కాళ్లకు సంకెళ్లు వేయడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ అమెరికా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. పైపెచ్చు తమ దేశంలోకి అక్రమ మార్గంలో ప్రవేశిస్తే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుందంటూ ఏకంగా ఓ వీడియో రూపొందించి యాడ్స్ వేసింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికా ప్రభుత్వ సలహాదారు, డోజ్ అడ్వైజర్ ఎలాన్ మస్క్ ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ ాహహ వావ్్ణ అంటూ క్యాప్షన్ పెట్టడం వివాదాస్పదంగా మారింది.

తాజాగా విడుదల చేసిన వీడియో యాడ్ లో.. అక్రమ వలసదారులను వెనక్కి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడం కనిపిస్తోంది. ఎయిర్ పోర్ట్ రన్ వే పైన సంకెళ్లతో కూడిన బాక్స్ ను, ఓ అక్రమ వలసదారుడికి సంకెళ్లు వేస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో చూపించారు. అయితే, సదరు అక్రమవలసదారుడి ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తానని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ హామీని అమలుచేసే క్రమంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై భారతదేశంలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ పద్ధతులలో అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులను ఇటీవల అమెరికా మూడు విమానాలలో తిప్పిపంపించింది. ప్రయాణంలో తమ చేతులకు, కాళ్లకు బేడీలు వేశారంటూ వారు వాపోయారు. అయితే, మహిళలు, పిల్లలకు సంకెళ్లు వేయడం లేదని అమెరికా అధికారులు చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు