Homeఅంతర్జాతీయంఅమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ పొడిగింపు: ట్రంప్

అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ పొడిగింపు: ట్రంప్

- Advertisement -

ఇప్పట్లో చర్చలు లేవు: జేడీ వాన్స్

వాషింగ్టన్: ఇరాన్‌తో రెండోవిడత చర్చలపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. అమెరికా- ఇరాన్ మధ్య ఈనెల 8న రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల విరమణ ముగియడానికి కొన్ని గంటల ముందు దీన్ని పొడిగిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సంఘర్షణ ముగించేందుకు ఇరాన్ ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చేవరకు దానిపై దాడులు చేయమన్నారు. అయితే, హోర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల రాకపోకలపై దిగ్బంధనం మాత్రం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇరాన్‌లోని అంతర్గత కలహాలే తదుపరి చర్చలు విఫలమవడానికి కారణమని ఈసందర్భంగా ట్రంప్ ఆరోపించారు. ఇక, తమ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను పొడిగించినందుకు ట్రంప్‌నకు పాక్ ప్రధాని షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. కొనసాగుతోన్న దౌత్య ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇది వీలు కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇప్పట్లో చర్చలు లేవు: జేడీ వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడి బందం పాకిస్థాన్‌లో ఇరాన్‌తో చర్చలు జరపడానికి సమాయత్తమైంది. అయితే ఇరాన్ నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఇప్పటిలో చర్చలు లేవని వాన్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. వైట్ హౌస్ వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇరాన్ మాత్రం మాపై దిగ్భంధనం తొలగిస్తేనే ముందుకు సాగుతాం అనే ధోరణిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు