Homeఅంతర్జాతీయంఏ దేశమూ ఇరాన్‌కు సహాయం చేయకూడదు

ఏ దేశమూ ఇరాన్‌కు సహాయం చేయకూడదు

- Advertisement -

ఇరాన్‌తో వాణిజ్యంపై భారత్‌కు అమెరికా పరోక్ష హెచ్చరిక!
భారత్-ఇరాన్ మధ్య వాణిజ్య ఒప్పందం వార్తలను ఖండించిన అమెరికా
ఇరాన్‌కు సాయం చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని మార్కో రూబియో హెచ్చరిక
ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు భేటీ అయిన నేపథ్యంలో అమెరికా వ్యాఖ్యలు

ఇరాన్‌తో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతోందన్న వార్తలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కొట్టిపారేశారు. అయితే, అమెరికా ఆంక్షలను తప్పించుకోవడానికి ఇరాన్‌కు ఏ దేశం సహకరించినా, ఆ దేశం కూడా తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన గట్టిగా హెచ్చరించారు. కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కెక్‌లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజేష్కియాన్‌తో భేటీ అయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఁభారత్, ఇరాన్ మధ్య వాణిజ్య ఒప్పందం ఉందని నేను అనుకోవడం లేదుఁ అని రూబియో ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అయితే, ప్రపంచంలోని చాలా దేశాలు తమ విదేశాంగ విధానాలను స్వతంత్రంగా రూపొందించుకుంటాయని, ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతాయని ఆయన అంగీకరించారు. అవసరమైనప్పుడు ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులతో తాము కూడా చర్చలు జరిపినట్లు ఆయన గుర్తుచేశారు.

ఆంక్షల విషయంలో వెనక్కి తగ్గేది లేదు
అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన హెచ్చరికను రూబియో పునరుద్ఘాటించారు. ఁఅమెరికా ఆంక్షలను తప్పించుకోవడానికి ఇరాన్‌కు ఏ దేశం సాయం చేయకూడదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి, అణ్వాయుధాన్ని నిర్మించడానికి అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలను ఇరాన్‌కు కల్పించకూడదు. ఒకవేళ ఏవైనా దేశాలు అలా చేస్తే, వాటిపై కూడా మేము ఆంక్షలు విధించాల్సి వస్తుందిఁ అని రూబియో హెచ్చరించారు.

ఇరాన్‌కు అణ్వస్త్రం దక్కనివ్వం
ట్రంప్ యంత్రాంగం ప్రధాన లక్ష్యం ఇరాన్‌ను అణ్వాయుధ శక్తిగా మారకుండా నిరోధించడమేనని రూబియో స్పష్టం చేశారు. ఁఅధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నంత కాలం ఇరాన్‌ను అణ్వస్త్ర దేశంగా మారేందుకు ఎప్పటికీ అనుమతించంఁ అని ఆయన అన్నారు. ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రాథమికంగా ఆర్థిక ఆంక్షలను ఉపయోగిస్తామని, అయితే అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని ఆయన తెలిపారు. ఇరాన్ తన ఆర్థిక వనరులను దేశ ప్రజల సంక్షేమానికి కాకుండా ఉగ్రవాదం, అణ్వాయుధాల కోసమే ఖర్చు చేస్తోందని రూబియో ఆరోపించారు.

గత ఆరు నెలలుగా ప‌శ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇటీవలి వారాల్లో ఇరు దేశాల మధ్య ఘర్షణలు పెరిగాయి. ఇరాన్ లక్ష్యాలపై రాత్రికి రాత్రే భారీ దాడులు చేశామని, అవసరమైతే మరోసారి దాడికి సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మరోవైపు, ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. తమ దేశం యుద్ధరంగంలో, దౌత్యపరంగా, ఆర్థిక దిగ్బంధనాన్ని ఎదుర్కోవడంలో కొత్త వ్యూహాన్ని అవలంబించిందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహసెన్ రెజాయీ హెచ్చరించారు. తమ కొత్త వ్యూహం అమెరికా పునాదులను కదిలిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు