Homeజాతీయంకోర్టుకు హాజరైన వల్లభనేని వంశీ

కోర్టుకు హాజరైన వల్లభనేని వంశీ

- Advertisement -

గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాల కేసు
నూజివీడులోని కోర్టుకు హాజరైన వల్లభనేని వంశీ

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈరోజు ఏలూరు జిల్లా నూజివీడులోని కోర్టుకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాలకు సంబంధించి ఆయనపై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి ఈనాటి వాయిదాకు ఆయన హాజరయ్యారు. కోర్టు వద్దకు వచ్చిన పలువురు వైసీపీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, ఆ కార్యాలయంలో పని చేసిన వ్యక్తి కిడ్నాప్ కేసులకు సంబంధించి జైలు నుంచి బెయిలుపై విడుదలైన తర్వాత వల్లభనేని వంశీ ఎక్కువగా బయట కనిపించడం లేదు. కోర్టులో నకిలీ పట్టాల కేసు విచారణ నేపథ్యంలోనే ఈరోజు ఆయన బయటకు వచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు