కౌశల్ సైన్స్ క్విజ్ రాష్ట్ర స్థాయి పోటీలకు చైతన్య నగర్ విద్యార్థి ఎంపిక.
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవరాయుడి పాలెం గ్రామం చైతన్య నగర్ లో నూతనంగా ఏర్పాటు చేయబడిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి యజ్జల వీర వెంకట విజయ వర్ధన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కౌశల్ జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ లో ప్రథమ స్థానం పొంది డిసెంబర్ 27వ తేదీన తిరుపతిలో జరిగే భారతీయ విజ్ఞాన సమ్మేళనం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా విజయ వర్ధన్ మా గ్రామం నుంచి ఎంపిక కావడం మాకు గర్వకారణం అని మాధవరెడ్డి పాలెం గ్రామ సర్పంచ్ అన్నదేవుల వీర వెంకట సత్యనారాయణ (చంటి) పేర్కొన్నారు. విద్యార్థికి సైన్స్ పుస్తకాన్ని మెమొంటోని ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని మధిర వెంకట కృష్ణ కామేశ్వరి, గైడ్ టీచర్స్ గండి స్వామి ప్రసాద్, మహమ్మద్ షెహన్స షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ వర్ధన్ ను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మల్లవరపు నాగమణి, కౌశల్ మండల కోఆర్డినేటర్ చింతలపూడి శ్రీనివాస భరద్వాజ, ఉపాధ్యాయులు రాయుడు విజయలక్ష్మి, గొర్రె చాందిని, బిఎస్ చక్రవర్తి స్థానిక నాయకులు బొల్లా ధనుంజయ్, ఆరుగొల్లు పెద పోశయ్య తదితరులు అభినందించారు.


