Monday, March 31, 2025
Homeజిల్లాలుకర్నూలుగ్రామాభివృద్ధే తన ధ్యేయం.. సర్పంచ్

గ్రామాభివృద్ధే తన ధ్యేయం.. సర్పంచ్

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయం అని గ్రామ సర్పంచ్ రామాంజనేయులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని లక్ష్మి పేట, మార్కండేయ స్వామి దేవాలయం వెనుక చివరి కాలనీ వాసులకు తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదన్నారు. ఈ విషయం సర్పంచ్ దృష్టికి తీసుకురావడంతో శుక్రవారం కొత్తగా పైపు లైను వేసి 60 ఇళ్లకు తాగునీటి సమస్య పరిష్కారిండం జరిగిందన్నారు. సకాలంలో స్పందించి తాగునీటి సమస్య పరిష్కారించినందుకు కాలనీ వాసులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామాంజనేయులు మాట్లాడుతూ గ్రామంలో ఎవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు