పేద విద్యార్థినికి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని రామిరెడ్డి అందజేశారు. మండలంలో పొంగుటూరు గ్రామానికి చెందిన నక్క మమత స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతి విద్యను అభ్యర్థిస్తుంది. మమతకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వలన విద్యార్థిని తల్లి పదవ తరగతి చదివిన తర్వాత చదువును నిలిపివేస్తామని తెలపడంతో, విషయం తెలుసుకున్న ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంకు కొండలరావు, విద్యార్థి ని స్థితి తెలుసుకొని ఆయన మిత్రుడు ఆస్ట్రేలియా లో ఉంటున్న శ్రీ రామిరెడ్డికి విషయం తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించి విద్యార్థిని చదువు నిమిత్తం ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని విద్యార్థిని తల్లికి అందజేశారు. విద్యార్థిని మమత చదువులలో ముందుంటుందని, అత్యధిక మార్కులు కూడా పాఠశాలలో నిర్వహించే పరీక్షలలో సంపాదించుకుంటుందని కొండలరావు తెలిపారు. విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామరాజు పాల్గొన్నారు.