Friday, April 4, 2025
Homeజాతీయంరాజ్య‌స‌భ‌లో వ‌క్ఫ్ బిల్లుకు ఆమోదం

రాజ్య‌స‌భ‌లో వ‌క్ఫ్ బిల్లుకు ఆమోదం

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న వ‌క్ఫ్ (స‌వ‌ర‌ణ‌) బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 128, వ్య‌తిరేకంగా 95 ఓట్లు వ‌చ్చాయి. కాగా, లోక్‌సభలో సజావుగా ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు.. 24 గంట‌ల త‌ర్వాత ఎగువ స‌భ‌లో కూడా ఆమోదం పొంద‌డం విశేషం. సుదీర్ఘ చ‌ర్చ అనంత‌రం రాజ్య‌స‌భ‌లో ఈ బిల్లుకు ఆమోదం ల‌భించింది. అర్ధరాత్రి దాటేవ‌ర‌కూ స‌భ‌లో విస్తృత చ‌ర్చ జ‌రిగింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వ‌క్ఫ్ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ, బిల్లు ముస్లిం ప్రయోజనాలకు హాని కలిగిస్తుందనే ఆరోపణలను తోసిపుచ్చారు. వక్ఫ్ బోర్డు నిర్వహణ, సృష్టి, లబ్ధిదారులు అంతా ముస్లింలే ఉంటార‌ని, ముస్లిమేతరులు దాని వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేరని నొక్కి చెప్పారు. ఈ బిల్లు మతానికి సంబంధించినది కాదన్న మంత్రి… ఆస్తి, దాని నిర్వహణకు సంబంధించినదని, అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుందని స్ప‌ష్టం చేశారు. ఒక ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటించే ముందు యాజమాన్య రుజువు అవసరం అవుతుందని ఆయన అన్నారు. ఇక చ‌ర్చ సంద‌ర్భంగా మంత్రి రిజిజు, మ‌రో కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న వక్ఫ్ లేబుల్ చేయబడిన ఆస్తుల జాబితాను ప్ర‌క‌టించారు. వాటిలో ఢిల్లీలోని లుటియెన్స్ జోన్‌లోని ఆస్తులు, తమిళనాడులోని 400 సంవత్సరాల పురాతన ఆలయం, ఫైవ్ స్టార్ స్థాపన కోసం భూమి, పాత పార్లమెంట్ భవనం కూడా ఉన్నాయి.

కాగా, లోక్‌సభలో వ‌క్ఫ్ బిల్లుకు మొత్తం 288 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది దీనిని వ్యతిరేకించిన‌ విష‌యం తెలిసిందే. 12 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చ అనంతరం, అర్ధరాత్రి తర్వాత స్పీకర్‌ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించ‌డం, ఆమోదం పొంద‌డం జ‌రిగింది.

పార్ల‌మెంట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లు తదుపరి రాష్ట్రపతి ఆమోదానికి పంపించ‌డం జరుగుతుంది. అక్క‌డ ఆమోదం పొందిన త‌ర్వాత చ‌ట్టంగా మారుతుంది. ఈ ప్రతిపాదిత చట్టం వక్ఫ్ ఆస్తులను నియంత్రించే 1995 చట్టాన్ని సవరించడం లక్ష్యంగా పెట్టుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు