సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
విశాలాంధ్ర,కదిరి : రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తి కామ్రేడ్ సుబ్బిరెడ్డి ని కోల్పోయామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. వేమయ్య యాదవ్ తెలిపారు
సిపిఎం పార్టీ నాయకులు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని ఆయన స్వగ్రామం వరిగిరెడ్డి పల్లిల్లో ఆయన మృతదేహన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కామ్రేడ్ సుబ్బిరెడ్డి సుదీర్ఘ కాలంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అనేక పోరాటాలు ఉద్యమాలు కొనసాగించా
రన్నారు.కరువుకు నిలయమైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు,కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన రైతులు పరిహారం కోసం
ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతుల పక్షాన రాజీలేని పోరాటాలు చేసాడని ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీగేయానంద్,వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కేశవ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్ప, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మధు నాయక్, సీపీఐ పట్టణ కార్యదర్శి లియాకత్ అలీ తదితరులు పాల్గొన్నారు.