Friday, February 28, 2025
Homeజిల్లాలుకర్నూలునాటుసారా నిర్మూలనలో భాగస్వాములు కావాలి

నాటుసారా నిర్మూలనలో భాగస్వాములు కావాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : నాటుసారా నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎక్సైజ్ శాఖ సీఐ బార్గవ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీ దేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతురావు, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారి సుధీర్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నాటుసారా నిర్మూలన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో ఁనాటుసారా రహిత సమాజ నిర్మాణం కొరకుఁ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటుసారా అమ్మినా, కలిగి ఉన్నా అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాంటి వారిపై బైండోవర్ కేసులను పెడతామని, అలాగే నాటుసారా నేరం చేస్తూ పట్టుబడితే లక్ష రూపాయలు జరిమానా తహశీల్దార్ ద్వారా విధించడం జరుగుతుందని తెలిపారు. నాటుసారా నిర్మూలనకు మహిళా సంఘాలను, గ్రామ కమిటీ సభ్యులను, యువ సంఘాలను, వివిధ శాఖల ఉద్యోగులను భాగస్వాములను చేసి నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తామని వెల్లడించారు. నాటుసారా తయారీ, అమ్మేవారిపై సమాచారం ఉంటే 9440902589 నెంబర్ కు ఫోన్ చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు