: టిడిపి పట్టణ కన్వీనర్ కే రామాంజనేయులు
ఇంటింటా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు, నేతలు
విశాలాంధ్ర-గూడూరు: అరులైన ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టిడిపి పట్టణ కన్వీనర్, పట్టణ మాజీ వైస్ చైర్మన్ కే రామాంజనేయులు అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం గూడూరు పట్టణంలో ప్రజాప్రతినిధులు, నేతలు పర్యటించి కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో గూడూరు పట్టణం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని కర్నూలు డిసిసిబి చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆధ్వర్యంలో గూడూరు నగర పంచాయతీని అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. ఎన్నికలు ముందు ఇచ్చిన హామీ మేరకు నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను అమలు చేశారని రాను రోజుల్లో అంతకుమించి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధిని చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న డి విష్ణువర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని టిడిపి నేతలు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టిడిపి నేత బొజుగు సృజన్, సింగల్ విండో డైరెక్టర్ రేమట వెంకటేష్, పట్టణ తెలుగు యువత హనుమంతు, టిడిపి నేతలు వీర కుమార్, పట్టణ వాల్మీకి కార్యదర్శి పోలకల్ మండ్ల వెంకటేష్, నాగప్ప యాదవ్, గౌండరాజు, గౌడ కుమార్, ప్రభాకర్, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తాం
RELATED ARTICLES