Tuesday, July 15, 2025
Homeజిల్లాలుకృష్ణహామీలన్నీ నెరవేర్చేందుకు కృషి: కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి

హామీలన్నీ నెరవేర్చేందుకు కృషి: కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి

సంక్షేమ పథకాలను వివరిస్తున్న నియోజవర్గ పరిశీలకుడు రామలింగారెడ్డి
విశాలాంధ్ర-గూడూరు: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. సూపరిపాలన తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని గుడిపాడు గ్రామంలో మండల కన్వీనర్ జి సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, నియోజవర్గ పరిశీలకుడు రామలింగారెడ్డి హాజరై ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు చేసింది శూన్యమని అన్నారు. కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేగంగా వెళుతున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గుడిపాడు టిడిపి నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపిటిసి ఎల్లప్ప, బూత్ ఫై ఇన్చార్జి కమిటీలు క్లస్టర్ ఇన్చార్జీలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు