Wednesday, February 18, 2026
Homeజిల్లాలుకృష్ణఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఉద్యం రిజిస్ట్రేషన్ నమోదు : ఐ పి ఓ మనోజ్

ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఉద్యం రిజిస్ట్రేషన్ నమోదు : ఐ పి ఓ మనోజ్

- Advertisement -

విశాలాంధ్ర – గూడూరు: వాసవ్య మహిళా మండలి మరియు హెచ్ సి ఎల్ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో, జిల్లా పరిశ్రమల శాఖవారితో ఉద్యం రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ కప్పలదొడ్డి గ్రామంలో పుణ్యవతి కలంకారి యూనిట్ దగ్గర గురువారం ఆంధ్రప్రదేశ్ చిన్నా, సూక్ష్మ తరహా పరిశ్రమలు శాఖ తో రాంప్ ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరిగింది. కృష్ణాజిల్లా పరిశ్రమల ఐ పి ఓ మనోజ్ మాట్లాడుతూ, మహిళలు, నిరుద్యోగులు, చిన్న, సూక్ష్మ, తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సహించే దిశగా పనిచేస్తుందని ఉద్యం సర్టిఫికెట్ ను ఉద్దేశించి, బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ సబ్సిడీలు, సొంత బిసినెస్ పెట్టుకువాడని రుణ పొందడానికి ఉపయోగ పడుతుందని అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సును నిర్వహించి, ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు, సహాయ సహకారాలను వివరించారు. 81 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి ఉద్యయం నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో కప్పలదొడ్డి కలంకారి ఉత్పత్తి దారులు, కలంకారి కళాకారులూ, వాసవ్య మహిళా మండలి సభ్యులు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు