Thursday, January 15, 2026
Homeజిల్లాలుఅనంతపురంకుర్లపల్లి లో రైతు ఆత్మహత్య

కుర్లపల్లి లో రైతు ఆత్మహత్య

- Advertisement -

విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం మండల పరిధిలోని కుర్లపల్లి గ్రామంలో అప్పులబాధ తాలలేక రైతు వెంకటేశులు(30)గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనకున్న 5 ఎకరాల పొలంలో పంటలు సాగు చేసి నష్టపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి, కొడుకుల ఇద్దరు సేద్యం చేసినా అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో పొలంలోకి వెళ్లి చెట్టుకి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య, ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. కుటుంబాన్ని ఆదుకోవాలని భార్యాపిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు