ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చెల్లా శ్రీనివాసులు.
విశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా వృద్ధులకు వికలాంగులకు వారి వారి ఇళ్ల వద్దనే సరుకులు పంపిణీ చేయాలని ముదుగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్ల వద్దనే రేషన్ సరుకులు పంపిణీ చేయాలనే ప్రభుత్వ ఆదేశాలను రేషన్ డీలర్లు ఏమాత్రం పట్టించుకోకుండా తమ స్టోర్ వద్దనే సరుకులు పంపిణీ చేస్తుండడంతో సకాలంలో సరుకులు అందక వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. మండల వ్యాప్తంగా సుమారు 70 మంది డీలర్లు ప్రభుత్వ చౌక దుకాణాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. కాగా కొంతమంది డీలర్లు తమకు కేటాయించిన కార్డుదారులు ఉన్నచోట కాకుండా ఎక్కడో దూరంగా తమ ఇష్టం వచ్చిన ప్రదేశంలో చౌక దుకాణాన్ని నిర్వహిస్తుండడంతో చాలామంది లబ్ధిదారులకు సకాలంలో రేషన్ సరుకులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోక ప్రేక్షక పాత్ర వహిస్తునడంతో చాలామంది రేషన్ డీలర్లు ప్రభుత్వ ఆదేశాలను పూర్తిగా విస్మరించి వృద్ధులు వికలాంగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు.
కనుక ఇప్పటికైనా రేషన్ డీలర్లు వృద్ధులు వికలాంగుల ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు, లేనిపక్షంలో త్వరలోనే కార్డుదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.
వృద్ధులు వికలాంగులకు ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేయాలి..
- Advertisement -
RELATED ARTICLES


