ఎంఈఓ గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం : ప్రభుత్వ ఆదేశాల మేరకు రాణీ లక్ష్మీబాయి కోసం స్వీయ రక్షణ కరాటే శిక్షణా తరగతులు ప్రారంభం శుభదాయకమని గర్వించదగ్గ విషయమని ఇది బాలికలకు ఆత్మరక్షణగా ఉపయోగపడుతుందని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణములోని నెహ్రూ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రమంతా పాఠశాలలో చదువుతున్న బాలికలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని తమకు తామే రక్షించుకునే విధంగా కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. అందుకే ఈ కరాటే క్రీడను ప్రభుత్వం గుర్తించి పాఠశాలల్లో ప్రవేశపెట్టడం బాలికలకు వరంగా మారిందని తెలిపారు. ఈ కరాటే వంటి క్రీడను కచ్చితంగా ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కరాటే వల్ల తమకు తాము రక్షించుకుంటూ శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం కలిగి ఉంటారని తెలిపారు. ఈ శిక్షణ నవంబర్ ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు పట్టణంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం మండల కన్వీనర్ గా 16 పాఠశాలలకు ఇన్చార్జిగా మల్టీ స్టార్ బుడోకాన్ కరాటే అకాడమీ కరాటే మాస్టర్లు ఎస్. ఇనాయత్ భాషా కు జి. నవ్యశ్రీ కి ప్రభుత్వం తరఫున బాధ్యతలను అప్పగించడం జరిగిందని తెలిపారు. తదుపరి కరాటే మాస్టర్లు ప్రభుత్వానికి, ఎంఈఓ లకు కృతజ్ఞతలను తెలియజేశారు.
స్వీయ రక్షణ కరాటే శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం గర్వించదగ్గ విషయం
- Advertisement -
RELATED ARTICLES


