విశాలాంధ్ర ధర్మవరం;; 30 సంవత్సరాలుగా వాడుకలో ఉన్న వాటిని దారి గుండా వెళ్ళుటకు కొందరు అడ్డంకి కలిగించి మూసి వేయడంతో, ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకొని పరిష్కరించడం జరిగిందని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని
ముదిగుబ్బ మండలం మంగళమడక గ్రామానికి చెందిన సాకే గంగన్న అనువారికి 1.93 ఎకరాల భూమి కలదు అని, సదరు భూమికి చేరుకునే దారి సుమారు 30 సంవత్సరాలుగా వాడుకలో ఉన్నదని, అయితే గత కొంత కాలంగా సదరు దారి గుండా వెళ్ళుటకు కొందరు అడ్డంకి కలిగించి, రాళ్లు,మట్టి వేసి దారి మూసివేశారని అర్జీదారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకొని ఆర్డీవో తో పాటు ధర్మవరం తహశీల్దారు , మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, గ్రామ రెవిన్యూ అధికారి, గ్రామ సర్వేయర్ లతో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి రెవిన్యూ రికార్డులు, వాటికి సంబంధించిన ప్రతి రికార్డులను పరిశీలించగా, సర్వే నెం. 349 గుండా దారి ఉన్నట్లు నిర్ధారించడం జరిగిందన్నారు. భూమిలో గల దారిని అడ్డుకోవద్దని, అలాగే మట్టి , రాళ్లతో వేసిన అడ్డంకులను తొలగించి దారి సమస్యను అత్యవసర విచారణ ద్వారా పరిష్కరించడం జరిగిందన్నారు. తద్వారా దాదాపు 15 మంది రైతులకు మేలు జరిగినదని తెలిపారు. చాలా కాలంగా ఉన్న తమ సమస్యను పరిష్కరించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆర్డీవో మహేష్ కు, తాసిల్దార్లకు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అడ్డంకులను తొలగించి దారి సమస్యను పరిష్కరించిన ఆర్డీవో మహేష్
- Advertisement -
RELATED ARTICLES


