Homeజిల్లాలుకృష్ణరాజావర్ధన్ రెడ్డి జయంతి..రోగులకు పండ్లు, బ్రేడ్లు పంపిణీ

రాజావర్ధన్ రెడ్డి జయంతి..రోగులకు పండ్లు, బ్రేడ్లు పంపిణీ

- Advertisement -

విశాలాంధ్ర- గూడూరు: కర్నూలు కేడీసీసీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి తనయుడు మాజీ ఎంపీపీ స్వర్గీయ రాజా వర్ధన్ రెడ్డి 47వ జయంతి వేడుకలకు టిడిపి నేతలు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం మండలంలోని కే నాగలాపురంలో టిడిపి మండల కన్వీనర్ జె సురేష్ అధ్యక్షతన డి రాజవర్ధన్ రెడ్డి జయంతి వేడుకలను టిడిపి నేతలు ఘనంగా జరుపుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జె సురేష్ మాట్లాడుతూ మంచికి మానవత్వానికి మారుపేరుగా నిలిచి డి రాజవర్ధన్ రెడ్డి ప్రేమ ఆప్యాయతకు అనురాగానికి ప్రతీక గా నిలిచారని కొనియాడారు. రాజవర్ధన్ రెడ్డి చేసిన సేవలను ప్రతి ఒక్కరు స్మరించుకుంటూ ఆయన అడుగు జడలో నడవాలని పలువురు కోరారు. అనంతరం పెంచికలపాడు సమీపంలోని విశ్వభారతి హాస్పిటల్ నందు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయగా నాగలాపురం గ్రామంలో రాజవర్ధన్ రెడ్డి గారి 47 వ జయంతి సందర్భంగా యువత రక్తదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సినీ యాక్టర్, నేత గోపాల్ రెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి, డీలర్ గిరి, నాగ సుంకన్న,ఎంపీటీసీ మద్దిలేటి, గిడ్డయ్య, బ్రహ్మయ్య,యుగంధర్, సొసైటీ డైరెక్టర్ అలిపిర, సుంకన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు