చంద్రగిరి: ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చంద్రగిరి శాసనసభ్యులు ఎమ్మెల్యే పులి వర్తినాని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు త్వరితగతిన నష్టపరిహారం అందించిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రగిరి, పాకాల మండలాలోని భీమవరం, శేషాపురం, యల్లంపల్లి, చిన్నరామపురం, బి.కొంగరవారిపల్లి, కూచివారిపల్లి, కొండ్రెడ్డికండ్రిగ, పాకాల, పాలగుట్టవారిపల్లి, పదిట్లబైలు గ్రామాలలో ఏనుగుల దాడిలో ఎక్కువగా పంట దెబ్బతింది. గత అసెంబ్లీ సమావేశాలలో చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని చంద్రగిరి, పాకాల, చిన్నగొట్టుగల్లు, యర్రావారిపాలెం మండలాలలో ఏనుగుల వలన పంటనష్టం తీవ్రంగా ఉంది అని డిప్యూటీ సిఎం దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఏనుగుల దాడిలో పంట నష్ట పోయిన రైతుల వివరాలు సేకరించి సంబంధిత అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నష్ట పరిహారం త్వరితగతిన చెల్లించే విధంగా చర్యలు చేపట్టిన, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి, కూటమి ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసిపి రైతులను సర్వ నాశనం చేసిందని ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోలేదని కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటుందని తెలిపారు. అందులో భాగంగా చంద్రగిరి, పాకాల మండలాల పరిధిలోని పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 25 లక్షలు నష్ట పరిహారం మంజూరు చేసిందన్నారు. మంజూరు అయిన చెక్కులను సంబంధిత రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. కష్టకాలంలో రైతులను ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే పులివర్తి నాని కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, మండలస్థాయి నాయకులు, రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏనుగుల దాడి బాధిత రైతులను ఆదుకుంటాం
- Advertisement -
RELATED ARTICLES


