విశాలాంధ్ర – కడియం : ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవించాలని శ్రీ సమన్వి హాస్పిటల్ డాక్టర్ సౌజన్య అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన కడియం గ్రామంలో, ఆర్ఎంపి రాజు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం శ్రీ సమన్వి హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సందర్భంగా డాక్టర్ సౌజన్య మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని, వారందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితముగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి సహకరించిన శ్రీ లక్ష్మీ దుర్గ మెడికల్ షాప్ వారికి ధన్యవాదములు తెలిపారు
కడియం లో ఉచిత వైద్య శిబిరం.
- Advertisement -
RELATED ARTICLES


