Homeఅంతర్జాతీయంపశ్చిమాసియా ఉద్రిక్తతలు.. 5,500కు పైగా విమానాలు రద్దు

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. 5,500కు పైగా విమానాలు రద్దు

- Advertisement -

కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు వెల్లడి
ఇజ్రాయెల్‌-అమెరికా, ఇరాన్‌ల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ నుంచి ఇప్పటివరకు 5,500కు పైగా విమానాలు రద్దయినట్లు పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు ( k. rammohan naidu) రాజ్యసభలో వెల్లడించారు. ఇందులో భారత విమానయాన సంస్థలకు చెందిన 4,335, విదేశీ సంస్థలకు చెందిన 1,187 విమానాలు ఉన్నాయని తెలిపారు.‘‘పశ్చిమాసియాలో గగనతలం మూసివేతల కారణంగా ఈమేరకు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో విమానయాన కార్యకలాపాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. పౌర విమానయానశాఖ, డీజీసీఏలు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. అవకాశం లభించినప్పుడల్లా విమానాలు నడుపుతున్నాం. ఇలా ఇప్పటివరకు దాదాపు 2.19 లక్షల మందిని చేరవేశాం. ఇప్పటికీ కొన్ని గగనతలాలు మూసిఉన్నాయి. అవి అందుబాటులోకి వచ్చి, సురక్షిత పరిస్థితులు ఏర్పడినప్పుడే విమానాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకోగలవు్ణ్ణ అని ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అని వెల్లడించారు.

గతేడాది డిసెంబరులో ఇండిగో విమానాలు పెద్దసంఖ్యలో రద్దయిన వ్యవహారంలో.. ప్రయాణికులకు ట్రావెల్ కూపన్ల రూపంలో రూ.163.92 కోట్ల మేర పరిహారం ఇప్పటికే అందినట్లు తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రయాణికులకు మరింత పరిహారం చెల్లించేలా విమానయాన సంస్థతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు