విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: సమాచార హక్కు చట్టంతో వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే ఆయుధమని సమాచార హక్కు చట్టం పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ. వన్నూరప్ప పేర్కొన్నారు. శ్రీ బాలాజీ బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ కె .చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన గురువారం సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం తో ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు, సమస్యలపై అన్వేషణ, అధ్యాయనం చేసి లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే పరిష్కారాన్ని చూపుతుందన్నారు. బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ కె.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం పై ప్రతి విద్యార్థి అవగాహనను పెంపొందించుకుని ప్రజలను మేలుకొల్పాలున్నారు. ప్రభుత్వ కార్యాలయంలోనూ సమాచార హక్కు చట్ట ప్రతినిధి ప్రతి శాఖలోనూ కేటాయించి ఉంటారని.. సమస్యలపై ఫిర్యాదు, పరిష్కారం, ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం సంపూర్ణ పరిజ్ఞానాన్ని పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల ప్రిన్సిపల్ డా. ముని కృష్ణారెడ్డి, చంద్రశేఖర్, సుందర్ రాజు, రామ్ తుల్లా, నాగరాజు, రామలింగం పాల్గొన్నారు.