డిప్యూటీ డిఎమ్ అండ్ హెచ్ఒ .సెల్వియా సాల్మాన్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని డిప్యూటీ డిఎంహెచ్వో సెల్వియా సాల్మన్ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో వైద్యులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించి క్షయ వ్యాధి నిర్మూలనపై అవగాహన నిర్వహించారు. అనంతరం సేల్వియా సాల్మాన్, టీవీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ క్షయ ఒక అంటూ వ్యాధి అని, తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, క్షయ క్రిములు గాలి ద్వారా వ్యాపిస్తాయని తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు, గల్ల పడడం, బరువు తగ్గుట ,ఆకలి లేకపోవడం తదితర లక్షణాలు క్షయ వ్యాధి అని గుర్తించాలని, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఖరీదైన మందులను ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని, క్షయరోగికి చికిత్స కాలములో ప్రతినెల 1000 రూపాయలు వారి ఖాతాలో జమ పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ డాక్టర్ మాధవి, దర్శనమల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత ,డాక్టర్. శ్వేత, టీబీ యూనిట్ సూపర్వైజర్స్ క్రిష్టప్ప, రహమత్ భాష ,ఎరికిలప్ప, బాలాజీ నాయక్ ,ఆశా కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రపంచ క్షయ దినోత్సవం..
RELATED ARTICLES