Friday, May 2, 2025
Homeఅంతర్జాతీయంప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కనబారో లుకాస్ కన్నుమూత

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కనబారో లుకాస్ కన్నుమూత

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరొందిన క‌న‌బారో లుకాస్‌ కన్నుమూశారు. బ్రెజిల్‌కు చెందిన 116ఏళ్ల స‌న్యాసిని మృతి చెందినట్లు అక్క‌డి అధికారులు వెల్లడించారు. క‌న‌బారో 1908 జూన్ 8న బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్‌లో జ‌న్మించారు. ఆమె 117 పుట్టిన‌రోజుకు కేవ‌లం నెల రోజుల ముందు క‌న్నుమూశారు.

వృద్ధాప్య సమస్యల కారణంగా కాసెరోస్‌లోని శాంటా కాసా డి మిసెరికార్డియా ఆసుప్ర‌తిలో చికిత్స పొందుతూ మృతిచెందిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆమె త‌న జీవితంలో ఎక్కువ భాగం న‌న్‌గానే ఉన్నారు. కాగా, 21వ యేటా స‌న్యాసినిగా ప్ర‌క‌టించుకున్న క‌న‌బారోకు ఫుట్‌బాల్ ఆట అంటే ఎంతో ఇష్టం.

అందుకే ఆమె త‌న ప్ర‌తి బ‌ర్త్‌డేకు ఫుట్‌బాల్ టీష‌ర్టును ధ‌రించి పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను సెల‌బ్రేట్ చేసుకునేవార‌ట‌. ఆమె మృతిప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇక‌, క‌న‌బారో లుకాస్ మృతితో 115 ఏళ్ల వ‌య‌సు ఉన్న ఈథెల్ కేట‌ర్ ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోనే అత్యంత వృద్ధ మ‌హిళ‌గా గుర్తింపు పొందారు. ఆమెది ఇంగ్లండ్ దేశం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు