Wednesday, January 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా జరిగిన యోగవేమన జయంతి వేడుకలు

ఘనంగా జరిగిన యోగవేమన జయంతి వేడుకలు

ఆడియో మహేష్, ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది, ఆర్డీవో మహేష్ ఆధ్వర్యంలో యోగివేమన జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు యోగివేమన చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆర్డిఓ మాట్లాడుతూ యోగివేమనను చేసిన సేవలను వారు కొనియాడారు. యోగివేమన రాసిన ప్రతి పద్యము అందరికీ మంచి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో;; పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సాయి మనోహర్ ఆధ్వర్యంలో యోగివేమన జయంతి వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో తో పాటు కార్యాలయ సిబ్బంది చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ యోగువేమన 14వ శతాబ్దపు వారని, అసలు పేరు పెదకొమిటి చిన్న వేమారెడ్డి అని తెలిపారు. వీరు రచించిన పద్యాలు అందరికీ జీవిత మార్గదర్శకాలు ఏర్పడే విధంగా ఉన్నాయని తెలిపారు. యోగివేమన సామాజిక విప్లవ కవి అని, ఆనాడు ఉన్న వర్ణ, వర్గా, కుల, మత సామాజిక రుగ్మతుల వ్యతిరేకమని, వేమన పద్యం వినని వారు ఉండాలని తెలిపారు. వీరి పద్యం చివరిగా విశ్వదాభిరామ వినురవేమ అని పూర్తి చేస్తారని తెలిపారు. వీరి రచనలు అతి సరళమైన భాషలో ఉంటూ పామర్రులకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటాయని తెలిపారు. యోగివేమన శ్రీ సత్య సాయి జిల్లా కదిరికి సమీపంలో కటారు పళ్ళు యందు మరణించడం జరిగిందని వీరి సమాధి కూడా అక్కడే ఇప్పటికీ కలదనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో. అబ్దుల్ నబీ, కార్యదర్శులు, సీనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు