Homeతెలంగాణతెలంగాణలో పోటీ చేసి తీరుతాం...

తెలంగాణలో పోటీ చేసి తీరుతాం…

- Advertisement -

: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

తెలంగాణలో జనసేన ఉంటుందని, తాము పోటీ చేసి తీరుతామని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణపై తనకు ఎంతో ప్రేమ ఉందని, అది రాజకీయాలకు అతీతమైందని అన్నారు. తెలంగాణ ప్రజలు తనకు ఎన్నోసార్లు అండగా నిలిచారన్నారు. తనను బెదిరించిన వారికి హెచ్చరికలు జారీ చేశారు.

తెలంగాణ ప్రజలే అండగా నిలిచారు.. ‘‘ఈ మధ్యన కొందరు నన్ను హైదరాబాద్‌లో ఎలా అడుగు పెడతావు.. ఇక్కడ నీకేం పని అని అడుగుతున్నారు. మీరెవరయ్యా నన్ను బెదిరించడానికి.. బెదిరించే వాళ్ల అయ్య జాగీరా తెలంగాణ. మీ ఇష్టానికి మాట్లాడితే నేను భయపడాలా? నాపై దాడులు చేస్తామంటున్నారు కదా.. నాకు తెలంగాణలో బెదిరింపుల కన్నా ఆంధ్రాలోనే బెదిరింపులు ఎక్కువ. తెలంగాణ యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకొనే వ్యక్తిని నేను. ఆంధ్రాలో నన్ను తిరగనివ్వం అంటే వారాహి అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రజలే. నాకు ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు అండగా నిలిచారు. జనసేనను తెలంగాణ నడిబొడ్డున ఏర్పాటు చేశాం.

‘‘తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలని మా నేతలు చాలా సార్లు అడిగారు. ఆంధ్రాలోనే అధికారం కోరుకోని వాడిని. తెలంగాణలో అధికారం ఎందుకు కోరుతాను. నాకు అధికారంపై ప్రేమకాదు.. మార్పుపైనే ప్రేమ. తెలంగాణ ప్రజలకు ఆంధ్రాపై విద్వేషం లేదు. తెలంగాణ ప్రజలు ద్వేషం పెంచుకుంటే ఒక్క ఏపీ వ్యక్తి కూడా ఇక్కడ ఉండేవారు కాదు. తెలంగాణ నలుమూలల నుంచి తిరిగిన వ్యక్తిని.. ఇప్పుడు నన్ను విమర్శించేవాళ్లు ఆదిలాబాద్‌ అడవుల్లో తిరగలేదు.. నేను తిరిగాను.

‘‘నేను తెలంగాణకు వ్యతిరేకిని కాదు.. విభజించిన తీరుకు మాత్రమే వ్యతిరేకిని. సామాజిక తెలంగాణ రావాలని చెప్పి మరీ వచ్చాను. పార్లమెంటు తలుపులు మూసి విభజించిన తీరు తప్పని చెప్పా. తెలంగాణ వ్యతిరేకం అని వైఎస్‌ చెప్పినా, ఆయనకు ఊడిగం చేశారు. నేను ఇప్పటివరకూ ఒక్క తెలంగాణ నాయకుడిపైనా విమర్శలు చేయలేదు. ఒక విశ్లేషకుడి వ్యాఖ్యల వల్ల ఇది మొదలైంది. ఆ తర్వాత ప్రెస్‌ క్లబ్‌లో సమావేశం పెట్టి మరీ తిట్టారు. తెలుగు ప్రజలు 50ఏళ్లు కలిసి ఉన్న రాజధాని హైదరాబాద్‌. పాలకులు వేరు.. ప్రజలు వేరు. పాలకులను తిట్టండి. నేను చెరువును ఆక్రమించుకున్నాననే ఆరోపణలు వచ్చాయి. సీఎం రేవంత్‌రెడ్డికి చెబుతున్నా. ఒకవేళ నేను కబ్జా చేశానని నిరూపణ అయితే, స్వాధీనం చేసుకోండి. తెలంగాణలో నేనే తిరుగుతా. ఇన్నాళ్లూ భరించాం. ఇకపై జనసేన పోటీ చేస్తుంది. ఏం చేస్తారో చేసుకోండి అని పవన్‌కల్యాణ్‌ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు