జాబ్ మేళాకు విశేష స్పందన
విశాలాంధ్ర ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్య కుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, సంస్కృతి సేవా సంస్థ సౌజన్యంతో స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా ధర్మవరంలోని సిఎన్బి కళ్యాణ మండపంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాలో 99 కంపెనీల ప్రతినిధులు యువతీ యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా జాబ్ మేళాలో పాల్గొన్న యువతీ యువకులతో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఫోన్ ద్వారా మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు రాలేకపోయినందుకు బాధపడుతున్నానన్నారు. తిరుపతిలో జరిగిన ఘటన గురించి ఫోన్లో వివరించారు. ఒక వ్యక్తి ఉద్యోగం పొందాలంటే ఎక్కడికో వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలని, ఈజాబ్ మేళాలలో అటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగం పొందవచ్చన్నారు. నియోజకవ్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మేళాలు నిర్వహించడం జరుగుతోందన్నారు.ప్రస్తుతంమీకు తక్కువ జీతమని నిరుత్సాహం చెందకుండా ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో చేరాలన్నారు. తర్వాత మీ యొక్క స్కిల్స్ ని బట్టి జీతం పెరుగుతుందన్నారు. మన రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని, యువత తమ కాళ్ళ మీద తమ నిలబడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఒక ఉద్యోగం లోచేరి ఆర్థిక అభివృద్ధి చెందాలన్నారు. యువత ఒక లక్ష్యసాధన దిశగా కష్టపడి పని చేస్తే ఎంతటి కష్టమైనపనికూడా విజయవంతమావుతుందని ఈ దిశగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలన్నారు.యువతీ యువకులు మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించుకోవడం ఆనందకరమైన విషయం అన్నారు.
అనంతరం మంత్రి కార్యాలయం ఇన్చార్జి హరీష్ బాబు మాట్లాడుతూ. వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఆధ్వర్యంలో ఆయన కుమార్తె సంస్కృతి పేరు మీద ఉన్న సాంస్కృతి స్వచ్ఛంద సేవ సంస్థ ట్రస్ట్ ద్వారా ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ, యువకుల అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, అనేటువంటి ఒక సంకల్పంతో రాష్ట్రంలోనే ప్రముఖులైనటువంటి 99 కంపెనీల ప్రతినిధులుతో ఉపాధి కల్పించేటువంటి ఈ జాబ్ మేళాకు నియోజకవర్గ వ్యాప్తంగా 5,121 మంది అధిక సంఖ్యలో నిరుద్యోగులు యువతి యువకులు ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు అందులో 1,668 ఉద్యోగాలు పొందారని అని
తెలిపారు.
అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంపెనీ హెచ్ఆర్ లందరికీ మొమెంటులు అందించడం జరిగింది అన్నారు. తదనంతరం ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ ఈ జాబ్ నెలకి దాదాపు 99 కంపెనీస్ హాజరయ్యాయని, ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశామని, రాబోయే రోజులలో మరిన్ని జాబ్ మేళాల ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అలాగే జిల్లాల్లో జరుగుతున్నటువంటి స్కిల్ హబ్ లలో ప్రస్తుత టెక్నాలజీ తో ఉన్నటువంటి శిక్షణలు అందజేసి ఉపాధి కల్పిస్తామని తెలియజేశారు.