Homeఅంతర్జాతీయంఅమెరికా వెన్నుపోటు వైఖరి

అమెరికా వెన్నుపోటు వైఖరి

- Advertisement -

మాక్రాన్‌తో చర్చల్లో పెజెష్కియాన్తె

హ్రాన్: తెహ్రాన్‌తో చర్చల సమయంలో వాషింగ్టన్ వైఖరి వెన్నుపోటుతో సమానమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. యుద్ధం వేళ హోర్మూజ్ జల సంధికి సంబంధించి ఉద్రిక్తతలు కొనసాగతున్న తరుణంలో శాంతి చర్చల కసరత్తు సమయంలో పెజెష్కియాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 24 గంటల్లో శాంతి చర్చల్లో పురోగతి సాధించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఇరాన్ తమతో ఒప్పందానికి తొందరపడుతోందని అన్నారు. తమ షరతులకు అంగీకరిస్తేనే ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. ఈ పరిణామాల క్రమంలో ఫ్రాన్స్ అధినేత ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో పెజెష్కియాన్ ఫోన్ చర్చలు జరిపారు. చర్చల వేళ అమెరికా వైఖరినిపై అసంతృప్తి వ్యక్తంచేశారు. దౌత్య మార్గాన్ని బెదిరింపులు, ఒత్తిళ్లు, ఆంక్షల వైపునకు అమెరికా మళ్లించిందని ఆయన విమర్శించారు. రెండు సార్లు చర్చలు జరిపాం కానీ సంప్రదింపులను ఏ మాత్రం గౌరవించకుండా ఆ దేశం సైనిక దురాక్రమణకు పూనుకుందని పెజెష్కియాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది వెన్నుపోటు పొడవడం కాకపోతే మరేమిటని ప్రశ్నించారు. చర్చలు అర్ధవంతంగా జరిగినప్ప్పుడే ఫలితం ఉంటుందని, ఇరాన్‌పై అక్కసు వెళ్లగక్కుతుంటే చర్చలు ఎలా ఫలించగలవని ఆయన అడిగారు. యÖఏఈపై సైనిక చర్యలకు ఇరాన్ పాల్పడలేదని చెబుతూ, ఆ మేరకు వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. సైనిక చర్యలు ఎప్ప్పుడు చేపట్టినాగానీ ఇరాన్ సైన్యం తమ వైఖరిని బహిరంగంగా ప్రకటిస్తుందని చెప్పారు. హోర్మూజ్ జల సంధి పరిస్థితిపై పెజెష్కియాన్ స్పందిస్తూ అమెరికా దిగ్బంధం ప్రాదేశిక అస్థిరతకు దారితీసిందని అన్నారు. దిగ్బంధం ఎత్తివేస్తేనే హోర్మూజ్ జల సంధిని పూర్తిస్థాయిలో తెరిచే ఆస్కారం ఉంటుందన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ స్పందిస్తూ గల్ఫ్‌లో తీవ్రమవుతున్న ఘర్షణలపై ఆందోళన వ్యక్తంచేశారు. మౌలిక వసతులు, నౌకలపై దాడులను ఖండించారు. హోర్మూజ్ మార్గాలన్నీ తక్షణమే తెరవాలన్నారు. బేషరతుగా దిగ్బంధాలు ఎత్తివేయాలని కోరారు. హోర్మూజ్‌లో ఉద్రిక్తతలు తగ్గితే దౌత్యపరంగా చర్చలు పురోగిస్తాయని ఆయన ఆకాంక్షించారు.
కుదిరిన హోర్మూజ్ ఒప్పందం!
హోర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా-ఇరాన్ మధ్య ఏకాభిబ్రీపాయం కుదిరింది. ఈ మేరకు సౌదీ ప్రభుత్వానికి చెందిన అల్ అరేబియా మీడియా వెల్లడిం చింది. అమెరికా నౌకాదళ దిగ్బంధనం తొలిగే కొద్దీ హోర్మూజ్ మార్గాన్ని తెరిచే విధంగా రెండు దేశాలు ఒప్పందానికి వచ్చినట్లు వెల్లడించింది. జలసంధిలో చిక్కుకున్న నౌకల విడుదలకు అంగీకారం కుదిరినట్లు తెలిపింది. ఇరాన్‌తో చర్చలలో పురోగతితో యుద్ధం త్వరగా ముగుస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు. త్వరలో ఒప్పందం జరుగుతుందని ప్రకటించారు. హోర్మూజ్‌తో పాటు తెహ్రాన్ అణు కార్యాల యంపై ప్రతిష్ఠంభన తొలగబోతోందని అని ట్రంప్ వెల్లడించారు. ‘జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఇదంతా మేము ఒక ముఖ్య కారణం కోసం చేస్తున్నాం. వాళ్ల వద్ద అణ్వస్త్రాలు ఉండేందుకు అనుమతివ్వలేం. ఇది చాలా మంది అర్ధం చేసుకోగలరు. మేము చేస్తున్నది సరైనదేనని సమర్థిస్తారు. ఇదంతా చాలా త్వరగా ముగియబోతోంది. ఒకసారి ప్రతిష్ఠంభన తొలగి… ఒప్పందం కుదిరి… యుద్ధం ముగుస్తుంది’ అని ట్రంప్ వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు