పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్
ఇస్లామాబాద్: సరిహద్దుల్లో భారత్ డర్టీ గేమ్స్ ఆడుతోందంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఓ టెలివిజన్ ఛానెల్‌తో ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. అఫ్గాన్‌తో సరిహద్దు ఘర్షణల నడుమ భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా అందుకు ఆయన బదులిస్తూ… ‘కచ్చితంగా.. దాన్ని తోసిపుచ్చలేము. అందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు. పాక్ విషయంలో ఆఫ్ఘాన్, భారత్ అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. సరిహద్దుల్లో భారత్ డర్టీగేమ్స్ ఆడుతోందని వ్యాఖ్యానించారు. రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏకకాలంలో రెండువైపులా యుద్ధం చేయడానికి ఇప్పటికే వ్యూహాలను రూపొందించినట్లు ఆసిఫ్ తెలిపారు. అయితే, యుద్ధ వ్యూహాలను బహిరంగంగా చర్చించలేనంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే భారత్ తరఫున ఆఫ్గాన్ పరోక్ష యుద్ధం చేస్తుందంటూ ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు చేశారు.
అవసరమైతే రెండువైపులా యుద్ధం చేస్తాం
- Advertisement -
RELATED ARTICLES


