అమెరికా ఆంక్షలపై రష్యా
నాటో అణ్వస్త్ర విన్యాసాలకు ఖండన
మాస్కో: తమ దేశానికి చెందిన రెండు పెద్ద చమురు సంస్థలపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించడాన్ని రష్యా తీవ్రంగా ఖండిరచింది. ఇది ‘యుద్ధ చర్య’గా అని పేర్కొంది. రష్యా భద్రతా కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్, మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ గురువారం సామాజిక మాధ్యమం వేదికగా అమెరికా ఆంక్షలను ఖండిరచారు. ఉక్రెయిన్‌కు సంబంధించి శాంతి చర్చల కోసం క్రెమ్లిన్‌ను ఆశ్రయించిన వాషింగ్టన్ ఇలాంటి చర్యలు తీసుకోవడమంటే రష్యాను యుద్ధానికి ఉసకొల్పడమే అని అన్నారు. యూరప్‌తో కలిసి రష్యాపై యుద్ధానికి కాలు దువ్వుతున్నట్లు అమెరికా సంకేతాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, నాటో అణు విన్యాసాలనూ రష్యా ఖండిరచింది. అమెరికా అణ్వస్త్రాల నిల్వలు యూరప్, బ్రిటన్‌లో పెరుగుతున్నాయని, ఇది వ్యూహాత్మక స్థిరత్వానికి హానికరమని హెచ్చరించింది. అణ్వాయుధాలతో నాటో విన్యాసాలతో ఉద్రిక్తతలు, ముప్పు పెరుగుతాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా అన్నారు. ‘స్టెడ్‌ఫాస్ట్ నూన్’లో భాగంగా 14 మిత్రదేశాల 70 విమానాలతో నార్త్ సీలో అణ్వస్త్ర విన్యాసాలను నాటో నిర్వహిస్తోంది. రష్యా కూడా తమ సొంత అణు శక్తుల సామర్థ్యాన్ని పరీక్షించుకుంటోంది. కాస్మోడ్రోమ్ నుంచి ఐసీబీఎం, సబ్‌మెరైన్ నుంచి బాలిస్టిక్ క్షిపణులు, వ్యూహాత్మక బాంబర్ల నుంచి అణు సామర్థ్య క్రూయిజ్ మిసైళ్లకు ఇటీవల పరీక్షలు నిర్వహించింది.
ఇది యుద్ధ చర్య
- Advertisement -
RELATED ARTICLES


