Homeజిల్లాలుఅనంతపురంబాధితులకు అండగా కూటమి ప్రభుత్వం : ఎమ్మెల్యే అమిలినేని

బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం : ఎమ్మెల్యే అమిలినేని

- Advertisement -

విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. అనారోగ్యంతో బాధపడుతూ స్వంత ఖర్చులతో అప్పులు చేసి, ప్రైవేటు ఆసుపత్రులలో చూపించుకుని ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థికంగా అండగా నిలబడటం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వారికి సకాలంలో ముఖ్యమంత్రి సహాయనిది అందించి కొండంత అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు .ప్రజావేదిక లో గురువారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, స్థానిక నాయకులతో కలసి 22 మంది బాధితులకు 10.32 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను పంపిణీ చేశారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ అప్పులు చేసి ఆసుపత్రులలో చూపించుకుని ఇబ్బందులు పడుతున్న బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉండాలనే లక్ష్యంతో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సహాయనిదిని ప్రభుత్వం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీదేవి టిడిపి నాయకులు మల్లికార్జున, వెంకటేశులు శ్రీరాములు, తిప్పేస్వామి, శివన్న, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు