విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని ఐదు మండలాల ఫ్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల న్యాయమైన కోర్కెల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు భరోసా ఇచ్చారు. గురువారం ప్రజావేదికలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. సుదీర్ఘకాలంగా జర్నలిస్టులు పక్కా ఇంటి నిర్మాణం చేపట్టి ఇవ్వాలని కోరుతున్న కోర్కెను రాబోవు రోజుల్లో పరిష్కారం చేస్తారని భరోసా ఇచ్చారు ఇందుకోసం స్థల సేకరణకు అన్వేషిస్తున్నామని ఆర్డిఓ, తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్ లతో సమన్వయం చేసుకొని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రణాళిక రూపొందించామని అన్నారు. పట్టణంలో జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థల సేకరణ చేశామని, పక్కా భవన నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. జర్నలిస్టులు నిస్వార్ధంగా పనిచేస్తూ సమాజానికి హితోదికంగా తోడ్పాటు అందిస్తున్నారని ఇది నాకు తెలుసు అన్నారు. జర్నలిస్టు తన ఆరోగ్యం చూసుకుంటూ , కుటుంబ భద్రత కోసం చొరవ చూపించాలని సలహా ఇచ్చారు. తమ సమస్య లను విని పరిష్కారం దిశగా కృషి చేస్తానని భరోసా ఇవ్వడంతో ఎమ్మెల్యేకు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.


