Monday, May 19, 2025
Homeఆంధ్రప్రదేశ్ఇస్కాన్ లో ముగిసిన సమ్మర్ క్యాంప్..

ఇస్కాన్ లో ముగిసిన సమ్మర్ క్యాంప్..

టీఎంసీ సభ్యులు కృష్ణ మాధవ్ దాస్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఇస్కాన్ లో సమ్మర్ క్యాంపు ముగిసిందని శ్రీ సత్యసాయి జిల్లా ఇస్కాన్ డిఎంసి సభ్యులు కృష్ణ మాధవ్ దాస్ తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు దశ అవతార వేషధారణ ప్రదర్శించారు. అనంతరం భగవద్గీత శ్లోకాలను పఠించారు. బృందావనములో శ్రీకృష్ణుడి నాటకం కూడా ప్రదర్శించారు. తదుపరి హరినామ సంకీర్తన నృత్యంలో చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అనంతరం పూరీ జగన్నాథ బలదేవ సూత్రధారులను ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ డోనర్ నల్లపేట శంకరయ్య రిటైర్డ్ తాసిల్దార్ రామాంజనేయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు