Homeసాహిత్యంఎందుకనో…!

ఎందుకనో…!

- Advertisement -

ఎన్నో చెప్పాలనుకున్నా
ఏవో పంచుకోవాలనుకున్నా
ఇంకేవో ముద్రించుకొని వెళ్తున్నా
మౌనం ప్రళయాన్నే సృష్టిస్తుంది
యుద్దాలే చేయిస్తుంది
కొన్నిసార్లు జీవితాలు కుళ్లగొట్టేస్తుంది
ఎందుకనో…! ఓ సందేహం నాలో
ఆదమరచిన సమయాన
అడుగుపడని రోజులెన్నో
గుటక దిగని గడియలెన్నో
ఓదార్పునిచ్చే మనసు దూరమై
గడిచిన లెక్కలేని రాత్రులెన్నో
ఒంటరి పోరాటాలై ఒక్కోసారి
గుండెను మరింత బరువెక్కిస్తాయి
కళ్లు జలపాతాన్ని తలపిస్తాయి
పారిజాతాల పలకరింపులకోసం ఎదురుచూస్తాయి
వాసి జ్యోత్స్న, 9866843005

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు