Saturday, March 15, 2025
Homeహైదరాబాద్కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో హోలీ వేడుకలు

కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో హోలీ వేడుకలు

విశాలాంధ్ర బ్యూరో – నిర్మల్‌ జిల్లా : జిల్లా కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. హోలీ పండుగలో భాగంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీలు అవినాష్‌ కుమార్‌, రాజేష్‌ మీనా, అధికారులు, కలెక్టర్‌ క్యాంపు కార్యాలయ సిబ్బంది, పలువురు పాత్రికేయులతో కలిసి హోలీ పండుగను జరుపుకున్నారు. పరస్పరం ఒకరినొకరు రంగులు పూసుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులు సిబ్బందికి మిఠాయిలు పంచారు. జిల్లా ప్రజలందరికీ కలెక్టర్‌ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగను నిర్వహించుకోవాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు