ముంబయి: నోటి సంరక్షణ (ఓరల్ కేర్) విభాగంలో కోల్గేట్`పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ ఒక కీలకమైన అడుగు వేసింది. క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌ను తమ ‘కోల్గేట్ టోటల’ బ్రాండ్ కొత్త అంబాసిడర్‌గా నియమించింది. ఈ భాగస్వామ్యం నోటి ఆరోగ్యం పట్ల ఉన్న పాత ఆలోచనలను మారుస్తోంది. నోటిని కేవలం శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాకుండా, అది మన దైనందిన పనితీరులో ఒక ముఖ్యమైన భాగమని ఈ ప్రచారం ద్వారా చెబుతున్నారు. మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడానికి శారీరక దఢత్వంతో పాటు నోటి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని రాహుల్ ద్రవిడ్ ద్వారా కోల్గేట్ వివరిస్తోంది. ఇది కేవలం ఒక అలవాటుగా కాకుండా, ప్రతిరోజూ పాటించాల్సిన ఒక క్రమశిక్షణగా దీనిని ప్రమోట్ చేస్తున్నారు. కోల్గేట్ టోటల్ బ్రాండ్ అంబాసిడర్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలంటే ప్రతి చిన్న విషయం కూడా చాలా ముఖ్యం. అందులో నోటి ఆరోగ్యం ఒకటి. ఇది bంత ముఖ్యమైనదంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జట్లు మరియు హాన్సీ ఫ్లిక్ వంటి కోచ్‌లు ఇప్ప్పుడు తమ క్రీడాకారులకు దంత పరీక్షలను తప్పనిసరి చేస్తున్నారు. అక్కడే కోల్గేట్ టోటల్ నాకు తోడుగా నిలుస్తుంది. ఇది 8 రకాల దంత సమస్యలను రాకుండా అడ్డుకుంటుంది, తద్వారా మన పనితీరు మెరుగుపడటానికి ముందస్తు శక్తిని అందిస్తుంది’ అని తెలిపారు.


