కొత్త ‘యాంటీ గ్యాంగ్’ చట్టానికి ఆమోదం
గౌటెమాలా సిటీ: గౌటెమాలా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ముఠాలకు చెక్ పెట్టేందుకుగాను వాటిపై పోరునకు మరిన్ని వనరులను ప్రభుత్వానికి సమకూర్చేలా ‘యాంటీ గ్యాంగ్’ చట్టాన్ని ఆమోదించింది. బర్రియో 18, మరా సల్వట్రుచా ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. అలాగే, ముఠాల సభ్యుల శిక్షా కాలం పెంచడమే కాకుండా వారి కోసం కొత్త జైలు నిర్మించేలా ఈ చట్టం రూపొందింది. ఇటీవల బర్రియో 18 గ్యాంగ్‌కు చెందిన 20 మంది జైలు నుంచి పరారు కాగా చాలా ఏళ్లుగా పెండిరగ్ ఉన్న యాంటీ గ్యాంగ్ చట్టం ఆమోదానికి చర్యలు వేగం పుంజుకున్నాయి. పార్లమెంటు ఎదుట ప్రతిపాదించిన కొత్త చట్టానికి సభ్యుల ఆమోదం లభించింది. కాగా, 20 మంది ముఠా సభ్యుల పరారీలో భద్రతా వైఫల్యాన్ని అంగీకరిస్తూ ముగ్గురు ఉన్నత స్థాయి భద్రతా అధికారులు వారం కిందట తమ రాజీనామాలను సమర్పించిన విషయం విదితమే.


